ఆకట్టుకున్న గణిత అష్టావధానం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో గురువారం ఎం.నాగార్జున గణిత అష్టావధానాన్ని నిర్వహించారు. పృచ్ఛకులుగా ద్వితీయ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులు వ్యవహరించారు. వింత చదరం అంశానికి సర్తాజ్, వార గణన అంశానికి సౌందర్య, 325తో భాగాహారం అంశానికి శ్రావణి, కారణాంకాలు అంశానికి రమ్యశ్రీ, వర్గ భేదం అంశానికి మృదుల, గుణకారం అంశానికి రమ్యసుధ, 7తో నిషిద్దం అంశానికి మాధురి, అప్రస్తుత ప్రసంగం సీనియర్ లెక్చరర్ కొమ్ముల వెంకట సూర్యనారాయణ నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున అవలీలగా సమాధానమిచ్చి ఆహుతులందరినీ అబ్బుర పరిచారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.


