జొన్నాడలో అభయం
జొన్నాడలో వెలసిన శ్రీజనార్థనస్వామి అభయ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ స్వామిని కొలుస్తారు. భక్తులు సమీపంలోని గోదావరిలో స్నానమాచరించి దేవతామూర్తులను దర్శించుకుంటారు.
ఆలమూరులో ఉగ్ర రూపం
ఆలమూరులో ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ రథ సప్తమి రోజున భారీగా స్వామి రథోత్సవం నిర్వహిస్తారు.
కపిలేశ్వరపురంలో పద్మాసనంలో..
పూర్వం ఇక్కడి ఆలయం దోపిడీకి గురైంది. దీంతో అప్పటి అర్చకులు జనార్దనస్వామి విగ్రహాన్ని భూమిలో భద్రపరిచారు. కొన్నేళ్లు కిందట ఈ విగ్రహం బయట పడటంతో ఆలయాన్ని భక్తులు పునర్నిర్మించారు. ఈఆలయంలో జనార్థునుడు పద్మాసనంలో దర్శనమిస్తాడు.
మాచర జ్వాలాముద్ర
నవ జనార్దన ఆలయాల్లో సప్తమ క్షేత్రంగా భాసిల్లుతున్న మాచరలో స్వామి జ్వాలాముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. రథ చక్రాకృతిలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
పెద కోరుమిల్లిలో సాధక ముద్ర
గౌతమీ నది చెంతన అష్టమ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెద కోరుమిల్లిలోని స్వామి సాధక ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు.
జొన్నాడలో అభయం
జొన్నాడలో అభయం
జొన్నాడలో అభయం
జొన్నాడలో అభయం


