క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిత
రాజమహేంద్రవరం రూరల్: విద్యతో పాటు క్రీడలలో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2025 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఆకుల మురళి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పలివెల రాజు మాట్లాడుతూ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత ఆహార అలవాట్ల నేపథ్యంలో క్రీడలతో పాటు యెగా, మెడిటేషన్ చేయాలన్నారు. రాజమహేంద్రవరం మహిళాజైలు సూపరింటెండెంట్ వసంత కె.చెట్టి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మురళి, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావు, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్‌భాషా విజేతలను అభినందించారు. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న కాకినాడ ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావును, కోచ్ వెంకటరమణను సత్కరించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు.
చాంపియన్స్ వీరే...
మెన్స్ విభాగంలో ఇండివిడ్యువల్ చాంపియన్‌గా జి.అవినాష్‌కుమార్ (ఆదిత్య ఇంజినీరింగ్, సూరంపాలెం), స్పోర్ట్స్ విభాగంలో చాంపియన్‌గా ఆదిత్య ఇంజినీరింగ్ (సూరంపాలెం), గేమ్స్ విభాగంలో చాంపియన్ ఆంధ్రా పాలిటెక్నిక్ (కాకినాడ), ఓవరాల్ చాంచాయన్ ఆంధ్రాపాలిటెక్నిక్(కాకినాడ) నిలిచాయి. వుమెన్స్ విభాగంలో ఇండువిడ్యువల్ చాంపియన్‌గా వేగుల ప్రసన్న (ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్, కాకినాడ), స్పోర్ట్స్, గేమ్స్ చాంపియన్‌తో పాటు ఓవరాల్ చాంపియన్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ (కాకినాడ) నిలిచింది. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఓఎస్‌డీ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెన్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా
నిలిచిన కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ టీమ్
వుమెన్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ టీమ్
ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2025
క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిత


