మండపేటలో భోగ ముద్ర
మండపేటలో వేంచేసియున్న స్వామి భోగ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కపిలేశ్వరపురం మండలంలోని దాతపురిగా ప్రఖ్యాతిగాంచిన తాతపూడిలోని గోదావరి చెంతన తొలుత ఈ ఆలయం ఉండేది. వరదల వల్ల దేవాలయం దెబ్బతినడంతో పండితుల సలహా మేరకు మాండవ్యపురం (మండపేట)కు ఆ విగ్రహాన్ని తీసుకు వచ్చారని పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ జనార్దనుడితో పాటు ఆగస్త్యేశ్వర, కై లాసేశ్వర స్వాముల ఆలయాలు ఉండటం ప్రత్యేకత.
కోటిపల్లిలో సిద్ధ ముద్ర
భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా గోదావరి నదీ తీరాన కోటిపల్లిలో వైష్ణ, శైవ క్షేత్రాలు ఒకే శిఖరం కింద, ఒకే ధ్వజస్తంభంతో వేర్వేరు గర్భ గుడుల్లో ఉన్నాయి. ఇక్కడ జనార్దనస్వామి సిద్ధ ముద్రలో కనిపిస్తారు. ఛాయా సోమేశ్వరస్వామిని దర్శించుంటే సకల పాపహరణం జరుగుతుందని భక్తుల నమ్మకం.
మండపేటలో భోగ ముద్ర


