 
															ఎలక్ట్రీషియన్ మృతి
సఖినేటిపల్లి: కడలి గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ యడ్ల సత్యశంకర్(44) ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో బుధవారం మృతి చెందాడు. మోంథా తుపాను కారణంగా సఖినేటిపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. సఖినేటిపల్లి గ్రామ లైన్‌మన్ వద్ద సత్య శంకర్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. తుపాను కారణంగా దెబ్బతిన్న 11 కేవీ లైను మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్‌కు గురై స్తంభంపై నుంచి కిందకు పడి మృతి చెందాడు. మృతుడి బావమరిది గంటా రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు.
ఉరి వేసుకుని యువకుడు..
కాకినాడ రూరల్: కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఇంద్రపాలెం గ్రామానికి చెందిన కందుకూరి నరేంద్ర స్వరూప్ (17) కూలి పనులు చేసుకునేవాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం ట్రైనీ ఎస్సై లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
