 
															విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
రామచంద్రపురం: పట్టణంలోని కాకినాడ రోడ్డులో ఒక యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చుమిల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన బూర్ల చైతన్య (25) ఎలక్ట్రికల్ పనిచేస్తూంటాడు. ఈ క్రమంలో కాకినాడ రోడ్డులోని ఒక ఇంట్లో బుధవారం పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చైతన్యకు తల్లి, తండ్రి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. చైతన్య అయ్యప్ప మాలధారణ దీక్షలో ఉన్నాడు.
గల్లంతైన బాలుడి
మృతదేహం లభ్యం
కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పర కాలువ వద్ద సోమవారం గల్లంతైన పోలవరపు సాయి చరణ్ రుత్విక్ (11) మృత దేహం లభ్యమైంది. తుపాను ప్రభావంతో కాలువలో నీరు ఉధృతంగా రావడంతో సాయి చరణ్ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్‌లోని హరిత రిసార్ట్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. అతడి కోసం రెండు రోజులుగా ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది, తిమ్మాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై గణేష్ కుమార్ తెలిపారు.
 
							విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
