కబడ్డీ జట్టుకు 14 మంది ఎంపిక
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టుకు 14 మందిని ఎంపిక చేశామని స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ గొల్లలమామిడాడలో నిర్వహించిన ఇంటర్ కాలేజీయెట్ పోటీల ద్వారా వీరిని ఎంపిక చేశారన్నారు. ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకూ తమిళనాడులోని సేలంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు వీరు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ ఎంవీఎస్‌ఎన్ మూర్తి, కోచ్ పీవీవీ లక్ష్మి, మేనేజర్ కె.లోవరాజు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్ష ఫీజుకు 31 గడువు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మార్చి 2026లో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు ఈ నెల 30 తేదీతో ముగుస్తుందని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐఓ ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం సోమవారం తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే జనరల్, వృత్తి విభాగాల మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు, రెగ్యులర్, ఫెయిల్ అయిన (ప్రైవేట్) అభ్యర్థులు తమ పరీక్ష రుసుము గడువు తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.వెయ్యి ఆలస్య రుసుంతో నవంబర్ 6వ తేదీ వరకూ గడువు ఉంటుందన్నారు. విద్యార్థులు గడువు తేదీలోపు రుసుము చెల్లించాలన్నారు.
విఘ్నేశ్వరునికి
పంచ హారతి సమర్పణ
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి రాయచూరుకు చెందిన కరుటూరీ వెంకట రామకృష్ణ సోమవారం వెండి పంచ హారతి సమర్పించారు. దీని బరువు ఒక కేజీ 421గ్రాములు ఉంటుందని, దీని విలువ రూ. లక్ష తొంభై వేలని ఆలయ సిబ్బంది తెలిపారు. పంచ హారతిని ఆలయ ప్రధానార్చకుల మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను ఆలయ వేద పండితులు, అర్చకులు వేదాశ్వీర్వాదం పలికి, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
కబడ్డీ జట్టుకు 14 మంది ఎంపిక


