రాజమహేంద్రవరం సిటీ: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రామహేంద్రవరంలోని అన్ని గోదావరి ఘాట్లను మూసివేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా ప్రకటించారు. పుష్కర ఘాట్, లక్ష్మీగణపతి ఘాట్‌లలో నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. మోంథా తీవ్ర తుపానుగా మారుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్నానఘట్టాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు, ప్రజలు ఘాట్‌ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట నగర ఆరోగ్యశాఖాధికారి వినూత్న, ఎస్‌ఈ (ఇన్‌చార్జి) రీటా, ఈఈ మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.


