 
															పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ సీజ్
రాయవరం: పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పశువులను రక్షించిన ఘటన రాయవరం పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి, అక్కడ నుంచి రామచంద్రపురం వరకు, అక్కడ నుంచి నెల్లూరుకు ఐషర్ వ్యాన్ (టీఎన్66 ఏబీ 8470)పై తరలిస్తున్నారు. కొత్తూరు సంసేన్‌ను, తమిళనాడు జిల్లా తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన వ్యాన్ డ్రైవర్ వెట్రివేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, 14 చిన్నదూడలను సంరంక్షించి, సామర్లకోట గోశాలకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వ్యాన్‌ను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
