 
															చెరువులో వృద్ధురాలి మృతదేహం
సీతానగరం: ఏం కష్టం వచ్చిందో.. ఏమిటో ఓ పండుటాకు చెరువులో నిర్జీవమై కనిపించింది. మండలంలోని కాటవరానికి చెందిన తెలగారెడ్డి నాగమణి (96) వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె మనవడు, మనవడి భార్య బండారు బ్రహ్మం, అరుణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మతిస్తిమితం లేని వృద్ధురాలు నాగమణి ఎవరికీ చెప్పకుండా ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తమ బంధువులను ఆరా తీసినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. దీనిపై ఈ నెల 20న స్థానిక పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. కాటవరంలోని మొండి పుంత చెరువులో సాయంత్రం 5 గంటలకు ఆమె మృతదేహం ఉన్నట్టు స్థానికుల ద్వారా తెలిసింది. అది నాగమణి మృతదేహంగా కుంటుంబ సభ్యులు గుర్తించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రాంకుమార్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
