తలపై కత్తి పడి కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

తలపై కత్తి పడి కార్మికుడి మృతి

Oct 24 2025 7:38 AM | Updated on Oct 24 2025 7:38 AM

తలపై

తలపై కత్తి పడి కార్మికుడి మృతి

నల్లజర్ల: పామాయిల్‌ గెలలను కోస్తుండగా గెడ కత్తి కార్మికుడి తలపై పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లజర్ల ఎస్సై కె.దుర్గాప్రసాద్‌రావు కథనం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన పేర్ల నాగేశ్వరరావు (35) గురువారం ఉదయం సహచర కూలీలతో కలసి గంటావారిగూడెం రైతు పాకలపాటి సత్యసాయికి చెందిన దూబచర్లలో ఉన్న పామాయిల్‌ తోటలో గెలలు తీయడానికి వెళ్లాడు. గెడకు కత్తి అమర్చి గెలలు కోస్తుండగా ఆ కత్తి విడిపోయి అతని తలపైనే పడింది. ఈ ఘటనతో నాగేశ్వరరావుకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కొడుకు (12), కుమార్తె (8) ఉన్నారు. ఎస్‌ఐ కె.దుర్గాప్రసాద్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాణసంచా తయారీ కేసులో వ్యక్తి అరెస్ట్‌

చాగల్లు: అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న కేసులో ప్రధాన నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. ఈ నెల 17న చాగల్లు శివారులో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడైన పండూరి అన్నవరాన్ని గురువారం చాగల్లు శివారులో పట్టుకున్నారు. నిడదవోలు కోర్టులో అన్నవరాన్ని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్టు ఎస్సై వివరించారు.

తలపై కత్తి పడి కార్మికుడి మృతి 1
1/1

తలపై కత్తి పడి కార్మికుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement