
కార్తికం.. శుభారంభం
పవిత్ర కార్తిక మాసం ప్రారంభమైన వేళ బుధవారం జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పరమ మంగళకరమైన బ్రాహ్మీ ముహూర్త కాలంలో భక్తులు పావన గోదావరితో పాటు కాలువలు, ఆలయాల పుష్కరిణుల్లో కార్తిక పుణ్యస్నానాలు ఆచరించారు. ‘ఓం నమఃశివాయ’, ‘హరహర మహాదేవ శంభోశంకర’ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి. భక్తులు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి, గంగమ్మ తరగలపై విడిచిపెట్టారు. శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. రేవులు, ఆలయాల్లో దీపారాధనలు చేశారు. ఆ దీపకాంతుల్లో దైవసన్నిధానాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారికి అభిషేకాలతో పాటు ధన్వంతరి సహిత రుద్రహోమం నిర్వహించారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

కార్తికం.. శుభారంభం