
అంతర్జాతీయ సైన్స్ సెమినార్‌లో ప్రతిభ
రంగంపేట: అంతర్జాతీయ సైన్స్ సెమినార్‌లో రంగంపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని ఆవుపాటి రమ్య సత్తా చాటింది. ఈ నెల 18, 19 తేదీల్లో మలేషియాలోని ఎంఎంయూ సైబర్జియా వేదికగా సైన్స్ కాస్టిల్ ఆసియా పేరిట అంతర్జాతీయ సైన్స్ సెమినార్, ప్రాజెక్టుల ప్రదర్శన జరిగింది. ఇందులో రష్యా, జపాన్ సహా ఆసియాకు చెందిన 10 దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 2 వేలకు పైగా దరఖాస్తులు ఆసియా దేశాల నుంచి రాగా 393 ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు. దీనికి రమ్య, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని రమ్యసుధతో కలసి రూపొందించిన స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్ అనే ప్రాజెక్ట్ మన దేశం తరఫున ఎంపికై ంది. తద్వారా రమ్య కాంస్య పతకం సాధించింది. ఆమెను, గైడ్ టీచర్ రమ్యసుధను ఎంఈఓలు కె.శ్రీనివాసరావు, పి.మధుసూధనరావు, ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు.