
నిందితుడి అరెస్టు
నారాయణరావు ఘాతుకం గురించి ఉదయం 11 గంటలకు తెలిసిందని, దీంతో, ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని పెద్దాపురం డీఎస్సీ శ్రీహరిరాజు విలేకర్లకు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని కోర్టుకు అప్పగిస్తామన్నారు. అతడిపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేశామన్నారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత విచారణను వేగంగా పూర్తి చేసి, నారాయణరావుకు కఠిన శిక్ష పడేవిధంగా చార్జిషీటు దాఖలు చేస్తామని చెప్పారు. ఈ ఉదంతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, పార్టీలకు ఆపాదించడం నేరమేనని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.