 
															వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
● తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
● అప్పనపల్లి వెళ్లి వస్తుండగా ప్రమాదం
ముమ్మిడివరం: అప్పనపల్లి దైవ దర్శనానికి వెళ్లి మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న వారిని కోళ్లు తరలించే వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, అతడి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గుత్తులవారిపాలెం సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యానాం సుభద్ర నగర్‌కు చెందిన దింపు కార్మికుడు మట్టపర్తి నూకరాజు (50), భార్య నూకరత్నం (47), కుమారుడు రామ వెంకట కృష్ణ ప్రసాద్ (22) మోటారు సైకిల్‌పై అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తున్న వారిని గుత్తులవారిపాలెం వద్ద కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఐటీడీఏ ఏపీడీ టి.విశ్వనాథం అంబులెన్స్‌కు ఫోన్ చేయగా, అది రావడానికి ఆలస్యం అవుతుందని భావించి, వెంటనే గాయపడిన వారిని ఆటోలో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
