
అనారోగ్యంతో ఎంపీడీఓ కృష్ణగోపాల్ మృతి
కరప: కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరప ఎంపీడీఓ బి.కృష్ణగోపాల్(61) సోమవారం మృతి చెందారు. కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో ప్లానింగ్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి లభించడంతో గత నెల 19న ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారు. ఆయనకు భార్య, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి పలువురు నాయకులు, అధికారులు సంతాపం తెలిపారు.
బైక్ చోరీ కేసులో
ఇద్దరికి జైలు
గోపాలపురం: మోటార్ బైక్ చోరీ కేసులో ఇద్దరికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై పి.మనోహర్ సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది అప్పటి ఎస్సై కర్రి సతీష్‌కుమార్ బైక్ చోరీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూలపల్లి శివసుబ్రహ్మణ్యం, మరపట్ల రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో, కొవ్వూరు సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె.నాగలక్ష్మి వారికి జైలు శిక్ష విధించారు.
తైక్వాండో
పోటీలకు ఇద్దరి ఎంపిక
రాజోలు: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్టు కోచ్ మణికుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన అండర్–17 జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో వై.గంగాభవాని, హేమ సత్యశ్రీ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. స్థానిక ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిని మాజీ ఎమ్మెల్యే వేమా, జిల్లా ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ తదితరులు అభినందించారు.

అనారోగ్యంతో ఎంపీడీఓ కృష్ణగోపాల్ మృతి