రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం

Jul 24 2025 7:36 AM | Updated on Jul 24 2025 7:42 AM

జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమెర్జెన్సీ నడుస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్‌ శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదుచేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4,380 లిక్కర్‌ షాపులు, 43 వేల బెల్ట్‌షాపులు, పర్మిట్‌ రూమ్‌లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికై నా కూటమి సర్కార్‌ స్వస్తి పలికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు.

‘నన్నయ’ వీసీ ఆచార్య

ప్రసన్నశ్రీకి మరో అవార్డు

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీకి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌.సుబ్బకృష్ణ స్మారక అవార్డు–2025 లభించింది. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో 19 గిరిజన భాషలకు లిపి అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌(నార్త్‌)లోని క్లాసిక్‌ హోటల్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ఖ పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి నారీ శక్తి అవార్డును, 2025కు నెల్సన్‌ మండేలా ఇన్‌స్పైర్‌ అవార్డును ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసన్నశ్రీని పలువురు అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

అదనపు సిబ్బందిని

నియమిస్తాం

రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్‌ సంబంధిత ఇబ్బందులు పరిష్కరించేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడించారు. పారిశ్రామిక, వ్యాపార సంబంధ సమస్యలపై వెంటనే తనిఖీలు చేసి, పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. బుధవారం రాజమ హేంద్రవరంలో ఆయన విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పనులు, ఆర్డీఎస్‌ఎస్‌ పను లపై ఆరా తీశారు. దరఖాస్తు చేసిన రైతులందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్‌ స్టేషన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గోదా వరి పుష్కరాలకు విద్యుత్‌ అధికారులు ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్‌ వ్యవ స్థపై కొందరు అపోహలు, గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 75 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కె.తిలక్‌కుమార్‌, ఈఈ నక్కపల్లి శ్యామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాజకీయ ప్రేరేపిత  అరెస్టులు అన్యాయం
1
1/2

రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం

రాజకీయ ప్రేరేపిత  అరెస్టులు అన్యాయం
2
2/2

రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement