
స్థిర భూగర్భ జల నిర్వహణపై శిక్షణ
రాజానగరం: స్థిరమైన భూగర్భ జల నిర్వహణను నిర్థారించడానికి యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థల మధ్య శాసీ్త్రయ, సమాజ ఆధారిత సహకారం ఉండాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ సెమినార్ హాలులో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సదరన్ రీజియన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో స్థిర భూగర్భ జల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని యూనివర్సిటీలో బుధవారం ప్రారంభించారు. ‘గ్రౌండ్ వాటర్ సబ్‌స్టైనబుల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్ ఈస్ట్ గోదావరి’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ బోర్డు రీజినల్ డైరెక్టర్ జ్యోతికుమార్, డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాస్ భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాన్వేషణ, రీచార్జ్ పద్ధతులపై పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు.