
మిథున్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాసలామ్
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబాసలామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు వాగ్దానాలు చేసిందన్నారు. వాటిని నిలబెట్టుకోలేక, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
రాములోరి సాక్షిగా
‘బెల్టు’కు వేలం
చినవలసలలో రూ.7 లక్షలకు ఖరారు!
తాళ్లరేవు: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామ స్థాయిలో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అనధికారికంగా నిర్వహిస్తున్న వేలం పాటలకు సాక్షాత్తు రాములోరి ఆలయాన్ని వేదికగా చేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. శివారు మత్స్యకార గ్రామం గాడిమొగ పంచాయతీ చినవలసలలోని రామాలయంలో నిర్వహించిన వేలం పాటలో రికార్డు స్థాయిలో సుమారు రూ.7 లక్షలకు పాట ఖరారైనట్టు తెలిసింది. నూతనంగా ఎన్నికై న గ్రామ పెద్దల సమక్షంలో గంగాధరరావు అనే వ్యక్తి ఏడాది పాటు మద్యాన్ని విక్రయించుకునేందుకు ఈ పాట దక్కించుకున్నట్టు చెబుతున్నారు. మద్యం విక్రయాలకు పాట పెడుతున్నారని, పాడుకునేవారు రావాలంటూ చాటింపు వేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఎకై ్సజ్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం నిర్వహించిన వేలం విషయాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బయటపెట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

మిథున్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు