
ఆశ్చర్య‘పోక’ తప్పదు
కోనసీమలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతో పాటు మండపేట మండలం ద్వారపూడి ప్రాంతంలో సుమారు 386 ఎకరాల్లో పోక (వక్క) సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా, తోటల చుట్టూ గట్ల మీద ఈ పంట సాగవుతోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాకు పోక ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళను మించి ఇక్కడ వక్క సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎర్ర చెక్కల (పూజా సుపారీ) తయారీ ఇక్కడి ప్రత్యేకత.
‘కోకో’ల్లలుగా గింజల దిగుబడి
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో పండే కోకో గింజలు మాత్రమే నాణ్యమైనవని నిన్న మొన్నటి వరకూ పేరుండేది. కోనసీమలో పండే కోకో గింజలు ఇప్పుడు ఆ పేరును తుడిచిపెట్టేశాయి. జిల్లాలోని 3,800 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగవుతోంది. ఏటా సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి ఏటా రూ.54.20 కోట్ల విలువైన కోకో గింజల దిగుబడి వస్తోందని అంచనా.

ఆశ్చర్య‘పోక’ తప్పదు