తాళ్లపూడి: అన్నదేవపేట పంచాయతీ పరిధి సూరయ్యపేట వైఎస్సార్ కొత్త కాలనీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు, చెవులు, ముక్కు వద్ద పగుల గొట్టారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తాళ్లపూడి పోలీసులకు, తహసీల్దార్‌కు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఎలిపే రాజు, నూతంగి సురేష్ అన్నారు. దీనిని ఆ పార్టీ నాయకులు పిట్టా శ్రీనివాస్, పోశిన శ్రీకృష్ణదేవరాయులు, కందికొండ సత్యనారాయణ, ఊటాల నంద, గర్భాపు ఈశ్వరరావు, గొరిపర్తి రాజు, పూరూరి హరి తదితరులు తీవ్రంగా ఖండించారు.
సముద్రంలో బోటు బోల్తా మత్స్యకారులు సురక్షితం
కొత్తపల్లి: సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు కెరటాల ఉధృతికి బోల్తా పడింది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పాడకు చెందిన బొందు మసేను బోటుపై అదే గ్రామానికి చెందిన చేపల అప్పారావు, శ్రీహరిలు సోమవారం తెల్లవారు జామున ఉప్పాడలో నిర్మిస్తున్న మేజర్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లారు. బయలుదేరిన కొద్ది సేపటికే కెరటాల ఉధృతి కారణంగా బోటు బోల్తా పడింది. ఆ ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. హార్బర్ గట్టుకు బోటు ఢీకొనడంతో ధ్వంసమైంది. సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు.

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం