
● అలా... ఎగసిపడుతూ...
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డులో రక్షణ గోడను దాటి వస్తున్న అలలు
అలలు ఎగసి పడుతున్నాయి. ఇవి రెండు రోజుల నుంచి ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డును తాకుతున్నాయి. కడలి కల్లోలంగా మారడంతో కెరటాలు ముందుకు దూసుకొస్తున్నాయి. కెరటాల తాకిడికి బీచ్ రోడ్డు కోతకు గురైంది. ఈ రోడ్డులో రక్షణగా వేసిన బండరాళ్ల గోడను సైతం కెరటాలు ఢీకొడుతున్నాయి. దీంతో రాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. ఆ దారిలో వెళ్లే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సందర్శకులు సముద్ర తీరానికి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.
కొత్తపల్లి :