
స్ట్రాంగ్‌మన్‌గా జగన్.. స్ట్రాంగ్ వుమన్‌గా వందన
ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: అమలాపురం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్, స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో స్థానిక సర్ సీవీ రామన్ స్కూలు ప్రాంగణంలో ఆదివారం జరిగిన మూడో యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. కేటగిరీల వారీగా విజేతలకు బహుమతీ ప్రదానం జరిగింది. తుది ఫలితాలను హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు సోమవారం వెల్లడించారు. స్ట్రాంగ్‌మన్ విన్నర్‌గా ఎం.జగన్ (కాకినాడ), స్ట్రాంగ్‌మన్ రన్నర్‌గా కె.శివకుమార్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమన్ విన్నర్‌గా పి.వందన (అమలాపురం), స్ట్రాంగ్ వుమన్ రన్నర్‌గా బి.అఖిల (రామచంద్రపురం) నిలిచారు. అలాగే స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్‌గా డి.నాగేశ్వరరావు (రామచంద్రపురం), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్‌గా బి.అప్పన్న (అమలాపురం) సాధించారు. టీమ్ చాంపియన్‌షిప్ విన్నర్‌గా కాకినాడ, టీమ్ చాంపియన్‌షిప్ రన్నర్‌గా అమలాపురం కై వసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలు 24 మంది వచ్చే నెల ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్టు కోచ్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.

స్ట్రాంగ్‌మన్‌గా జగన్.. స్ట్రాంగ్ వుమన్‌గా వందన