పంట దిగుబడులకు సమగ్ర సస్యరక్షణే కీలకం | - | Sakshi
Sakshi News home page

పంట దిగుబడులకు సమగ్ర సస్యరక్షణే కీలకం

Mar 6 2025 12:18 AM | Updated on Mar 6 2025 12:19 AM

నల్లజర్ల: పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంట దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు కోసం చీడపీడల యాజమాన్యంలో రైతులకు అందుబాటులో ఉన్న అన్నిరకాల సమగ్ర యాజమాన్య పద్ధతులను వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు రైతులకు సూచించారు. విజయవాడలోని సెంట్రల్‌ ఐపీఎం కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం తెలికిచెర్లలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఏరువాక కేంద్రం డైరెక్టర్‌ డాక్టరు చల్లావెంకట నరసింహారావు మాట్లాడుతూ అధికంగా పురుగుల మందుల వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోవడంతో పాటు పురుగులలో నిరోధకశక్తి పెరగడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. వివిధ జీవ నియంత్రణ పద్ధతులు, మేలైన పురుగుమందుల గురించి వివరించారు. గ్రామసర్పంచ్‌ బండి చిట్టీ, జిల్లా వనరుల కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.జయరామలక్ష్మి, కేంద్రీయ సస్యరక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టరు మనోజ్‌పూరీగోస్వామి, పీపీఓ డాక్టరు కే.వి.చౌదరి, ఏపీఓ ప్రేమరంజితం, ఏఓ కమల్‌రాజ్‌, హెచ్‌ఓ బబిత, ఏఈఓ పుష్పలత, వీఏఏలు హేమంత్‌, సురేష్‌, వీహెచ్‌ఏ సాయి, రైతులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement