పథకం ప్రకారమే హిజ్రా హత్య

- - Sakshi

అమలాపురం టౌన్‌: తోటి స్నేహితుడి క్యారెక్టర్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందనే అక్కసుతో ధవళేశ్వరానికి చెందిన హిజ్రా మరపట్ల ఆనంద్‌ అనే ఆనందినిని తన ముగ్గురు స్నేహితులే అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈనెల 12వ రాత్రి సమయంలో ఆలమూరు మండలం జొన్నాడ గ్రామ శివారు ఎన్‌హెచ్‌ 216ఎ రహదారిని ఆనుకుని ఉన్న పంట కాల్వ బోదెలో హిజ్రా ఆనందిని గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో పీక, మెడ కోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆనందిని హత్య చేసిన ముగ్గురు స్నేహితులు ధవళేశ్వరానికి చెందిన కేతా భరత్‌ వెంకట సుధీర్‌ అనే పెద్ద కేతా, బొమ్మూరుకు చెందిన వీలు కళ్యాణ్‌ అనే పెద్ద కల్లి, ధవళేశ్వరానికి చెందిన సింగంపల్లి కార్తికేయ అనే సోనూలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరిని ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పాత క్వార్డర్స్‌ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడైన పెద్ద కేతా రౌడీషీటర్‌ కూడా. పెద్ద కల్లి కూడా రౌడీ షీటరే. పెద్దకల్లి, సోనూలపై గతంలో హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఇలా పాత నేరస్తులైన ఆ ముగ్గురూ హిజ్రా ఆనందిని పథకం ప్రకారం హతమార్చారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ఎస్‌.ఖాదర్‌ బాషా వెల్లడించారు. ఏఎస్పీ ఖాదర్‌ రావులపాలెం సీఐ ఎన్‌.రజనీకుమార్‌, క్రైమ్‌ సీఐ డి.గోవిందరావులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితుల నేర చరిత్రను చెప్పారు.

ఆనందిని చేస్తున్న తప్పుడు ప్రచారం సహించలేకే...
నిందితుల్లో ఒకడైన సోనూ మేనత్త హిజ్రా. ఆమెకు స్నేహితురాలు హిజ్రా ఆనందిని. అలా సోనూకు పరిచయమైన ఆనందిని తర్వాత పెద్ద కేతా, పెద్ద కల్లితో కూడా స్నేహం ఏర్పడింది. అలా సాగిపోతున్న వీరి స్నేహంలో హిజ్రా ఆనందిని తన క్యారెక్టర్‌కు సంబంధించి తప్పడు ప్రచారం చేస్తుండడంపై పెద్ద కేతా సహించలేకపోయాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పి ఆనందిని హత్యకు పథకం పన్నారు.

మద్యం సేవించి ఆపై హత్య
ఆ రోజు రాత్రి హిజ్రా ఆనందిని వేమగిరి సెంటరులో పెద్ద కేతా, సోనూలు తమ మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని జొన్నాడ సెంటరుకు చేరుకున్నారు. తర్వాత మద్యం కొనుక్కుని జొన్నాడ శివారు పంట బోదె వద్దకు చేరుకున్నారు. అక్కడ అందరూ మద్యం సేవించారు. వారి మరో స్నేహితుడు పెద్ద కల్లికి ఫోన్‌ చేసి అతడిని కూడా అక్కడికి రప్పించారు. వారితో పాటు పెద్ద కల్లి కూడా మద్యం సేవించాడు. హత్యా పథకంలో భాగంగా తొలుత పెద్ద కేతా తన వద్ద ఉన్న బటన్‌ నైఫ్‌తో ఆనంది నడుంపై పొడిచాడు. సోనూ హిజ్రా ఆనందిని కాళ్లు పట్టుకోగా పెద్ద కేతా వద్ద ఉన్న నైఫ్‌ను పెద్ద కల్లి లాక్కుని ఆమె మెడ వెనుక కుడి ఎడమ భాగాల్లో కోసివేశాడు. సోనూ బీరు బాటిల్‌తో ఆనందిని తలపై కొట్టడంతో చనిపోయిందనుకుని పక్కనే ఉన్న పంట బోదెలోకి నెట్టేశారు. అప్పటికీ ఆనందిని కొన ఊపిరితో కదలడాన్ని గమనించిన పెద్ద కల్లి ఇది బతికితే మనకు ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో బటన్‌ నైఫ్‌తో పీకను కసితీరా కోసేసి చంపేశాడు. ఆనందిని చనిపోయిందని నిర్ధారించుకుని ఆ ముగ్గురూ అక్కడ నుంచి పరారయ్యారు.

సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు
జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్‌ ఆదేశాలతో కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో రావులపాలెం సీఐ రజనీకుమార్‌, ఆలమూరు ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ అన్ని కోణాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సేకరించి అరెస్ట్‌లు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన బటన్‌ నైఫ్‌, రెండు మోటారు సైకిళ్లు, రూ.800 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేవలం 18 రోజుల్లో హత్య కేసును ఛేదించిన కొత్తపేట డీఎస్పీ, రావులపాలెం సీఐ, ఆలమూరు ఎస్సైలను ఎస్పీ శ్రీధర్‌,

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top