
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● పత్రికా స్వేచ్ఛపై దాడి అప్రజాస్వామికం
నిజాలను నిర్భయంగా రాసే మీడియా గొంతునొక్కడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘సాక్షి’ కార్యాలయంలో సోదాలు, ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు అంటూ రోజుల తరబడి విధులకు ఆటంకం కలిగించడం సమంజసంగా లేదు. మీడియాను ఇబ్బంది పెట్టడం అనేది అప్రజాస్వామిక విధానం. మీడియాలో వచ్చే కథనాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలే కానీ బెదిరింపులకు పాల్పడి అణచివేయాలని చూడడం మంచి పద్ధతి కాదు.
విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి
● మూల్యం చెల్లించుకుంటారు
పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి కార్యాలయంపై దాడులు, ఎడిటర్‌పై కేసులు అప్రజాస్వామికం. కూటమి ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పత్రికా స్వేచ్ఛను అణచివేస్తోంది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికై నా తమ తప్పును తెలుసుకుని వేధింపులు ఆపాలి.
– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే,
కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, వైఎస్సార్ సీపీ
● దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పత్రికా సేచ్ఛను హరించే విధంగా పాలకులు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రజల పక్షాన నిలిచి, వాస్తవాలను వెలికితీసి, ప్రపంచానికి తెలియజేసే పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాఽధించే చర్యలు చేపట్టడం అమానుషమైన చర్య. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడం ప్రజాస్వామ్యాన్ని
ఖూనీ చేయడమే అవుతుంది.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్,
రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి, వైఎస్సార్ సీపీ

సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025