
జిల్లాలో వర్షాలు
ఐ.పోలవరం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా నాలుగు రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ అడపాదడపా వాన పడుతూనే ఉంది. అత్యధికంగా కపిలేశ్వరపురం 29.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా 2.2 మిల్లీమీటర్లు పడింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. కపిలేశ్వరపురం 29.6, కె.గంగవరం 28.8, సఖినేటిపల్లి 26.8, అయినవిల్లి 25.6, రావులపాలెం 19.2, ఆత్రేయపురం 18.8, ఆలమూరు 16.2, ముమ్మిడివరం 14.2, అమలాపురం 12.8, ఐ.పోలవరం 10.8, రామచంద్రపురం 9.2, పి.గన్నవరం 9.2, మండపేట 7.4, రాజోలు 7, మలికిపురం 6.6, ఉప్పలగుప్తం 5.8, కొత్తపేట 5.4, కాట్రేనికోన 5, రాయవరం 3.2, అల్లవరం 2,8, మామిడికుదురు 2.2 మిల్లీమీటర్ల చొప్పున వాన కురిసింది.