
అప్లికేషన్ మెథడ్స్‌పై అవగాహన అవసరం
అమలాపురం టౌన్: అప్లికేషన్ మెథడ్స్‌పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని డీఈవో షేక్ సలీం బాషా సూచించారు. ఇదే సమయంలో ఉపాధ్యాయులు కూడా అప్లికేషన్ మెథడ్స్‌పై అప్‌డేట్ అవ్వాలన్నారు. అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రశ్న ఏ విధంగా అడిగినప్పటికీ విద్యార్థులు ఠక్కున సమాధానం చెప్పేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. తనిఖీ అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యా బోధనపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలను అప్లికేషన్ మెఽథడ్‌లో రూపొందిస్తున్న విధానాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు. అసైన్మెంట్ బుక్ లెట్స్‌లో విద్యార్థులు సమాధానాలు రాస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. సబ్జెక్ట్‌ల వారీగా ప్రతి వారం విద్యార్థుల ప్రగతిని హెచ్‌ఎం సమీక్షించాలని సూచించారు. అనంతరం డీఈవో పాఠశాలలో పరీక్షలు జరుగుతున్న తరగతుల గదులకు వెళ్లి పరిశీలించారు. అనంతరం నూతనంగా విధుల్లోకి చేరిన డీఎస్సీ 2025 ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు ఉన్నారు.