
ఎస్‌జీఎఫ్ మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా రమాదేవి
కొత్తపేట: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా కొత్తపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పీడీ ఏఎస్‌ఎస్ రమాదేవి నియమితులయ్యారు. గత నెల 26న అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు నిర్వహించిన ఇంటర్వ్యూకు రమాదేవి హాజరు కాగా ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం ప్రొసీడింగ్స్ పంపారు. ఆ మేరకు 2025–26 విద్యా సంవత్సరం ఎస్‌జీఎఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. రమాదేవిని ఎంఈఓలు మట్టపర్తి హరిప్రసాద్, కె.లీలావతి, జెడ్పీజీహెచ్‌ఎస్ హెచ్‌ఎం ఎన్.సత్యనారాయణ, పీడీలు, పీఈటీలు అభినందించారు.
శనైశ్చరుని ఆలయంలో
హుండీల ఆదాయం లెక్కింపు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ 10,06,005 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి, సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, దేవదాయ శాఖ అమలాపురం, రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం హుండీలను తెరిచారు. వారి సమక్షంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు నగదును లెక్కించారు. 8 నెలల 11 రోజులకు హుండీ ద్వారా రూ.8,80,131, అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.85,357, దేవస్థానం క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయం హుండీ ద్వారా రూ.40,517 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. మందపల్లి ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకుడు సాదు చెంచయ్య, గ్రామ కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, కొత్తపేట వీఆర్వో యు.సీతాసుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
విరమించుకోవాలి
మలికిపురం: వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షు డు బూశి జాన్‌మోషే డిమాండ్ చేశారు. బు ధవారం ఆయన మలికిపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైద్య విద్యను దూరం చేయడానికి వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో బహుజన విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన పీపీపీ విధానం ఆయన సామాజిక వర్గానికి ప్రయోజనంగా ఉందే తప్ప, దీనివల్ల బహుజనులకు ప్రయోజనం లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరిధిలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మెడికల్ సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తుంటారని, తను క్యాబినెట్‌లో ఉన్న మంత్రి నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నవారికి మెడికల్ కళాశాలను ధారాద త్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు.
క్రీడా పోటీలకు ఎంపికలు
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ –14, 17 బాల బాలికలకు ఈ నెల 12, 19 తేదీల్లో క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. 12న ఫెన్సింగ్ ఎంపికలు సఖినేటిపల్లి మండలం మోరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 19న మాల్కంబ్ క్రీడలో ఎంపికలు మలికిపురం మండలం గుడిమెళ్లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు– 93469 20718, ఎన్‌ఎస్ రమాదేవి – 94400 34084 ఫోన్ నంబర్లలో సంప్రందించాలని అన్నారు.

ఎస్‌జీఎఫ్ మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా రమాదేవి

ఎస్‌జీఎఫ్ మహిళా విభాగ జిల్లా కార్యదర్శిగా రమాదేవి