
ప్రభుత్వం మెడలు వంచుదాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
రావులపాలెం: హామీలు అమలు చేయకుండా, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ప్రభుత్వం మెడలు వంచి పథకాలు సాధిద్దామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గంలో సుమారు 1,355 ఇళ్లకు తిరిగి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పీడీఎఫ్ అప్లోడ్ చేసినందుకు ఆ నియోజకవర్గం రాష్ట్రంలో 4వ ర్యాంకు, జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని రాజోలు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావును, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల పార్టీ పరిశీలకునిగా నియమితులైన కర్రి పాపారాయుడును జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి బుధవారం రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆయన స్వగృహంలో ఘనంగా సత్కరించారు.