
నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) నిర్వహణ కమిటీ సమావేశం పంచాయతీరాజ్ కమిషనర్ రేవు ముత్యాలరావు అధ్యక్షతన గురువారం జరుగుతుందని ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సీఈఓలు, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 కొత్త జిల్లాల్లోని డీపీఓలు, ఎన్‌ఐఆర్‌డీ రాష్ట్ర సమన్వయకర్త, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి ఈటీసీ ప్రిన్సిపాల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణలు, అభివృద్ధి పనులను సమీక్షించడం, వార్షిక శిక్షణ ప్రణాళికను ఆమోదించడం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారన్నారు.
13న కాకినాడ
జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
సామర్లకోట: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కాకినాడ జిల్లా జట్లను ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ పీఆర్ కళాశాల ఇండోర్ కబడ్డీ కోర్టులో జూనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. దీనికి హాజరయ్యే క్రీడాకారులు 2006 డిసెంబర్ 31 తర్వాత పుట్టిన వారై ఉండి, బాలురు 75 కేజీలు, బాలికలు 65 కేజీల లోపు బరువు ఉండాలన్నారు. జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై నవారు ఈ నెల 22 నుంచి 25 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితాతో రావాలని కోరారు.
తాటాకిల్లు దగ్ధం
కొత్తపల్లి: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి తాటాకిల్లు దగ్ధమైన సంఘటన కొండెవరంలో జరిగింది. బాధితుడు పెంకే సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తిబాబు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో వారందరూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో తాటాకిల్లు, దానిలోని గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పిఠాపురం ఇన్‌చార్జి అగ్నిమాపక అధికారి పి.హరిప్రసాద్, సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
పేకాట శిబిరంపై దాడి
బిక్కవోలు: పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశామని అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్ తెలిపారు. కొమరిపాలెంలోని ఒక చావిడిలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో బుధవారం తెల్లవారుజామున బిక్కవోలు ఎస్సై రవిచంద్ర, సిబ్బందితో దాడి చేశామన్నారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురితో పాటు, చావిడి యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, రూ.34,790 స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
హోటల్‌లో తనిఖీలు
గండేపల్లి: జిల్లా గూడ్స్, సర్వీస్ టాక్స్ జిల్లా ఇంటిలిజెన్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక హోటల్‌లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మల్లేపల్లి శివారు రాయుడు గారి మిలటరీ హోటల్లో (ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్) అధికారులు సుమారు ఉదయం 11.45 నుంచి తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలకు వచ్చిన అధికారులే స్వ యంగా వినియోగదారుల నుంచి బిల్లులు తీసుకున్నా రు. తనిఖీ జరుగుతున్నంతసేపు మీడియాను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం 7 గంటల వరకు తనిఖీ చేసిన అధికారు లు మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత గోప్యత ప్రదర్శించి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కాగా వారంతా జీఎస్టీ వివరాలు తని ఖీ చేసేందుకు వచ్చినట్టు స్థానికంగా భావిస్తున్నారు.

నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం

నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం