
పనులకు కదలిక
● వీరేశ్వరస్వామి ఆలయం పరిశీలన
● పునర్నిర్మాణానికి సూచనలు
ఐ.పోలవరం: వర్షం వస్తే నీటి వెతలు.. ఆపై మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కానరాని చర్యలపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. రూ.నాలుగు కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసినా పనులు ప్రారంభించకపోవడం, ఆపై వర్షం వస్తే ఆలయంలో ముంపు సమస్యలపై ‘స్వామీ.. నీ చెంత నీరేమీ’ అనే శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ స్థపతి, అసిస్టెంట్ స్థపతి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలసి బుధవారం ఆలయాన్ని పరిశీలించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, గాలి గోపురం, చండీశ్వరస్వామి, నవగ్రహ మండపాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణానికి చేసిన ప్లాన్‌ను వారు పరిశీలించి తగు సూచనలు చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో సిబ్బంది స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.

పనులకు కదలిక