
భక్తులతో పోటెత్తిన అయినవిల్లి
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధ, గురువారాల్లో భక్తులతో కిక్కిరిసింది. సుమారు 50 వేల మంది స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పంచామృతాభిషేకం, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీలక్ష్మీ గణపతి హోమం, లక్ష గరిక పూజ, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం ఏడు గంటలకు పంచ హారతులు ఇచ్చారు. స్వామివారిని ముషిక వాహనంలో ఉంచి ఆలయ మాడ విధుల్లో ఊరేగించారు. స్వామి సన్నిధిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పుష్పాలతో ఏర్పాటు చేసి షూట్ భక్తులను అకట్టుకుంది. అలాగే ఆలయ వెలుపల మట్టిపతిని ప్రతిష్ఠించి స్వామివారి నవరాత్రులు ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
రూ.80,348 విరాళం
స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి కొత్తపేటకు చెందిన తమ్మన ఎస్‌ఎస్ అఖిలేష్ రూ.25 వేలు, తోట వెంకటేశ్వరరావు, సత్యవాణి దంపతులు రూ.10 వేలు, ముమ్మిడివరానికి చెందిన పీవీఎస్ శాస్త్రి, సుజాత దంపతులు రూ.10,116, అమలాపురానికి కొత్తపల్లి శ్రీ నాగ చరిత రూ.10,116, రావులపాలెం మండలం రావులపాడు మద్దిపోటి శ్రీయాన్వి రూ.15 వేలు, రాజమండ్రికి చెందిన రవి శంకర్ శ్రీమతి లక్ష్మీ చైతన్య దంపతులు రూ.10,116 అందజేశారు. దాతలు ఈ మొత్తాలను ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతలకు పండితులు వేదాశీస్సులు అందజేసి, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

భక్తులతో పోటెత్తిన అయినవిల్లి