
నలుతెరంగులా వ్యవహరిద్దాం!
భాషాభిమానంతోనే
రోజుకో పద్యం
ఆలమూరు బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రతి రోజు ఒక సామాజికాంశం, ఆయా రోజుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ప్రతి రోజు ‘గౌరీ మల్లిక్’ కలం పేరుతో ఒక పద్యం రాస్తాను. అక్షరధనంతోనే అజ్ఞానాన్ని పారదోలగలం. భాషతోనే కీర్తి, స్ఫూర్తి. మానవీయతకు అద్దం పట్టేందుకు కృషి చేస్తున్నా.
– కామవరపు మల్లికార్జునరావు (మల్లిక్),
తెలుగు పండిట్, జెడ్పీహెచ్‌ఎస్, కండ్రిగ, ఆలమూరు
నైతిక విలువల బోధన
తెలుగు భాషను మించిన భాష లేదు. మాతృభాష ద్వారానే విద్యార్థుల్లో నైతిక, సామాజిక విలువలను పెంపొందించే అవకాశం ఉంటుంది. పద్యధారణ ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో స్వామి వివేకానంద, శారదామాత, రామకృష్ణ పరమహంస, బాలల నాటికలు, చిన్నారి స్నేహితులు(గేయాలు), నేనొక ప్రేమ పిపాసిని (కవితలు) తదితర రచనలు చేశాను.
– కూచిభొట్ల జనార్దనస్వామి,
తెలుగు పండిట్, జెడ్పీహెచ్‌ఎస్, ద్రాక్షారామం
రాయవరం: తెలుగు భాష తీయదనం.. తెలుగు భాష గొప్పదనం.. తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఓ మూలధనం.. అన్నాడో సినీ కవి. పంచదారకన్నా.. పాలమీగడ కన్నా, చెరకురసం కన్నా మధురమైనది మన తెలుగు భాష. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయులు ప్రవచిస్తే.. ప్రముఖ చరిత్రకారుడు ‘నికోలో డి కాంటీ’ తెలుగు భాషను శ్రీఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌శ్రీగా పేర్కొన్నాడు. తేనెలొలికే తెలుగుభాష గొప్పదనాన్ని మన కవులు శతాబ్దాల కిందటే విశ్వవ్యాపితం చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడుతున్నారు. దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష.
‘గిడుగు’ జయంతిని పురస్కరించుకుని
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర భాషగా ప్రభుత్వం ప్రకటించింది. మాతృభాషలో జ్ఞానాన్ని పొందకుంటే వ్యక్తిత్వ వికాసం.. మేధాపరమైన ప్రగతి మందగిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. తెలుగు భాషలోని నుడికారాలు, సామెతలు, జాతీయాలు, లోకోక్తులు ఇలా వేటికవే ప్రత్యేకం. అమ్మ భాషలోనే మన భావోద్వేగాలను సులభంగా వెల్లడించగలుగుతాం. తెలుగు భాష ఉన్నతికి అవిరళ కృషి చేయడంతో పాటుగా, తెలుగుజాతి గొప్పదనాన్ని ఖండాతరాలకు చాటి చెప్పిన బహుభాషా కోవిదుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఏటా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.
లోపిస్తున్న చిత్తశుద్ధి
అతి ప్రాచీన భాషల్లో ఒకటిగా తెలుగును భారత ప్రభుత్వం 2008 అక్టోబర్ 31న చేర్చింది. ప్రాచీన హోదా కల్పించడంతో పాటు ప్రభుత్వం చట్టాన్ని చేసినప్పటికీ అది ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. తెలుగు భాషను ప్రభుత్వపరంగా ఆచరణలో పెట్టాలని భావించి 1958వ సంవత్సరంలో ఆదేశాలు జారీ చేశారు. అవి అమలు కాకపోవడంతో 1991వ సంవత్సరంలో తెలుగు భాషను ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అయినప్పటికీ అమలు విషయంలో చిత్తశుద్ధి లోపించింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నేటికీ తెలుగుకు సంబంధించిన నిబంధనలు అమలు కావడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మారిన కారణంగా సొంతగడ్డపైనే తెలుగు పరాయిభాషగా మారిపోయిందని తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిడుగు వారి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చినప్పటికీ పాలకుల నిర్వాకంతో అమ్మ భాష రోజురోజుకూ నిరాదరణకు గురవుతోందనే భావనను పలువురు కవులు చెబుతున్నారు. ‘తెలుగు భాషా దినోత్సవం’ రోజు మాత్రం హంగామా చేస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో మాతృ భాష అమలు ఊసే ఉండడం లేదు.
శిష్ట వ్యవహారిక రూపశిల్పి ‘గిడుగు’
శిష్ట వ్యవహారికం పేరిట రామ్మూర్తి పంతులు వాడుక భాషలో బోధనకు పెద్దపీట వేశారు. అందుకే ఆయన జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలు మాత భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వ్యావహారిక భాషలో బోధనా ప్రచారం కోసం ఆయన ‘తెలుగు’ పత్రికను ప్రారంభించారు. ఆయనతో పాటుగా గురజాడ అప్పారావు, శ్రీనివాస అయ్యంగార్ వంటి వారి కృషి ఫలితంగా 1912–13లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్కూల్ ఫైనల్ పరీక్షను వ్యావహారిక భాషలో రాయవచ్చునని ఆదేశాలు జారీచేసింది.
సాహితీ ప్రక్రియలలో
తెలుగుకు అగ్రస్థానం
శతాబ్దాల క్రితమే విశ్వవ్యాపితం
ప్రపంచ వ్యాప్తంగా
10 కోట్ల మంది వినియోగం
వ్యావహారిక భాషోద్యమానికి
సారథ్యం వహించిన ‘గిడుగు’
నేడు తెలుగు భాషా దినోత్సవం

నలుతెరంగులా వ్యవహరిద్దాం!

నలుతెరంగులా వ్యవహరిద్దాం!

నలుతెరంగులా వ్యవహరిద్దాం!

నలుతెరంగులా వ్యవహరిద్దాం!