
ఆయువు తీసిన విద్యుత్ పాశాలు
● విధి నిర్వహణలో ఒకరు..
● ఆట సరదాలో మరొకరు మృతి
● వేర్వేరు ఘటనలలో
ఆరుగురికి గాయాలు
పెద్దాపురం: విద్యుత్ స్తంభంపై మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఒక లైన్‌మన్ మృతి చెందగా, మరో లైన్‌మన్ తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం పట్టణంలో చోటు చేసుకున్న ఘటనపై సీఐ విజయశంకర్, ఎస్‌ఐ మౌనిక తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కొండయ్యపేటకు చెందిన ఆరిమిళ్లి రామకృష్ణ (35), స్థానిక శివాలయం వీధికి చెందిన యాళ్ల చిన్నిబాబు స్థానిక పాశిలివీధిలో విద్యుత్ లైన్‌కు మరమ్మతు చేస్తున్నారు. ఇంతలో విద్యుత్ షాక్ తగలడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగగా చిన్నిబాబు తీవ్ర గాయాల పాలయ్యారు. రామకృష్ణకు తండ్రి, తల్లితో పాటు సోదరి ఉన్నారు. చిన్నిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దాపురం నాలుగో సచివాలయ పరిఽధిలో జూనియర్ లైన్‌మన్లుగా వారు పనిచేస్తున్నారు. రామకృష్ణ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చిన్నిబాబును ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాంకేతిక లోపం వల్లనే..
సంఘటన స్థలం వద్ద లైన్‌మన్ రామచంద్రరావు, రామకృష్ణ, చిన్నిబాబు ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అనంతరం జూనియర్ లైన్‌మన్‌లు పోల్ పైకి ఎక్కి పని చేస్తుండగా పైనున్న ఏ, బీ, సీ బ్లేడ్‌లలో ఏ బ్లేడ్ ఆఫ్ కాకపోవడంతో విద్యుత్ ప్రసరించి రామకృష్ణ మృతి చెందాడని ఏఈ వివరించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లైన్‌మన్ చిన్నిబాబు
విద్యుదాఘాతంతో మృతి చెందిన లైన్‌మన్ రామకృష్ణ

ఆయువు తీసిన విద్యుత్ పాశాలు

ఆయువు తీసిన విద్యుత్ పాశాలు