
వేధింపుల కేసులో భర్తకు రెండేళ్ల జైలు, జరిమానా
కాకినాడ లీగల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమైపె కర్రతో దాడి చేసిన భర్తకు రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి ఎ.నాగమల్లేశ్వరి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం తాళ్లరేవు మండలం పెద్దబొడ్డు వెంకటాయపాలేనికి చెందిన చెక్క నారాయణరావుతో వీరవేణికి వివాహమైంది. కొద్ది రోజుల అనంతరం అదనపు డబ్బులు కోసం భార్యను వేధించేవాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆమైపె కర్రతో దాడి చేశాడు. వీరవేణి ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్పీ తుహిన్ సిన్వా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నారాయణరావుపై నేరం రుజువుకావడంతో డబ్బు డిమాండ్ చేసినందుకు ఏడాది జైలు, రూ.500 జరిమానా, కర్రతో దాడిచేసినందుకు రెండేళ్లు జైలు, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
తొగరపాయలో వ్యక్తి గల్లంతు
కపిలేశ్వరపురం: మండలంలోని కేదారిలంక శివారు వీధివారిలంకకు చెందిన పల్లి చిట్టియ్య (65) తొగరపాయలో గల్లంతయ్యాడు. తన నివాసం నుంచి గురువారం ఉదయం తాతపూడి లంక పొలానికి వెళ్లి వస్తుండగా ప్రవాహంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆదేశాలపై ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, తహసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం తొగరపాయ సమీపంలో పడవలతో గాలించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. ఆచూకీ తెలిసిన వారు మండపేట సీఐకి 94407 96537, అంగర ఎస్సై హరీష్ కుమార్‌కు 94409 00770 నంబర్లలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

వేధింపుల కేసులో భర్తకు రెండేళ్ల జైలు, జరిమానా