
బ్యాటరీ చోరీ నిందితుల అరెస్టు
ఆలమూరు: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వాహనాల్లో బ్యాటరీ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం 216 ఏ జాతీయ రహదారి వెంబడి పలు చోట్ల లారీలు, వ్యాన్లలో బ్యాటరీలు చోరీలకు గురవుతున్నాయంటూ ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట పోలీసు స్టేషన్‌లతో ఐదు కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎస్పీ బి.కృష్ణారావు, కొత్తపేడీ డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆదేశాల మేరకు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ నేతృత్వంలోని బృందం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా చంద్రపాలేనికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.5 లక్షల విలువైన 20 బ్యాటరీలను, దొంగతనాలకు ఉపయోగించిన వేన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గురువారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి ఇంటూరి రవికిరణ్ వారికి రిమాండ్ విధించారు.
రూ.2.5 లక్షల విలువైన
20 బ్యాటరీలు స్వాధీనం