
రైలు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి
తుని: రైలు ప్రమాదంలో తండ్రీ, కొడుకులు మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గుండుకాయలంక గ్రామానికి చెందిన బొర్ర అనిల్ పాయకరావుపేట ఇందిరా కాలనీకి చెందిన సీ్త్రని ప్రేమ వివాహం చేసుకుని అక్కడే జీవివిస్తున్నాడు. రోజూ తాగివచ్చి భార్యను హింసించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 26న రాత్రి 8 గంటలకు తాగి వచ్చి భార్యతో గొడపపడి తన కుమారుడు గుణశేఖర్ (8) తీసుకుని గుంటూరు వెళ్లేందుకు పయనమయ్యాడు. వారిద్దరూ స్థానిక నాగరాజుపేట రైల్వే గేటు నుంచి తాండవనదిపై ఉన్న రైల్వే బ్రిడ్జిపై నుంచి తుని రైల్వే స్టేషన్‌కు నడిచి వెళ్తుండగా వెనుక నుంచి ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. దీంతో కుమారుడు గుణశేఖర్ మృతి చెందగా అనిల్ ఆచూకీ కనిపించలేదు. కాగా తన భర్త అనిల్ కనిపించడం లేదని అతని భార్య 27వ తేదీన పాయకరావుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా తాండవ నదిలో అనిల్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.