
ఇద్దరు పిల్లలకూ రాలేదు
పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నదే నా కోరిక. మా అమ్మాయి మైథలీ ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతుంది. మా అబ్బాయి పార్థూ బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరికీ ఏడాదిన్నరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. ఎంత రావాలన్నది కూడా మాకు తెలియడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోతే మా పిల్లల చదువులు ఆగిపోతాయని భయపడుతున్నాం. –మోకా స్వప్న, గూడపల్లి, మలికిపురం మండలం
కూలి పని చేసుకుని..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. రోజూ కూలి పనులకు వెళ్లి వచ్చిన సొమ్ముతోనే పిల్లల చదువు కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం మా అమ్మాయి మౌనిక బీటెక్ చదువుతుంది. ఇంకా కాలేజీ ఫీజు చెల్లించలేదు. రూ.70 వేల వరకూ రావాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేస్తే ఫీజులు కట్టాలని చూస్తున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. –కాదా వీర వెంకట సత్యనారాయణ, కె.గంగవరం
చదువులు మధ్యలోనే ఆపేయాలా?
మా నాన్న చనిపోయారు. అమ్మ తన రెక్కల కష్టంపైనే చదివిస్తుంది. నాకు దివ్యాంగుడైన అన్నయ్య ఉన్నాడు. నేను బీ.కామ్ కంప్యూటర్స్ చదువుకున్నాను. నాకు ఎంబీఏ చదవాలని ఉంది. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి ఏడాది వచ్చింది. మిగిలిన రెండేళ్ల ఫీజు రాలేదు. దీంతో ఉన్నత చదువులు చదవాలన్న నా ఆశయం నెరవేరేలా లేదు. మాలాంటి పేదల చదువులు మధ్యలోనే ఆపేయాలా?. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.
–యాట్ల కావ్య శ్రీరోహిత, ద్రాక్షారామ, రామచంద్రపురం రూరల్

ఇద్దరు పిల్లలకూ రాలేదు