
తొలి ఏడాది లేదు..
నేను రామచంద్రపురంలో డీసీఎంఈ చదువుతున్నాను. ఏడాదికి రూ.25 వేల కాలేజీ ఫీజు చెల్లించాలి. నాకు రెండో సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది. తొలి సంవత్సరం పడలేదు. దీనిని చెల్లించాలని కాలేజీ యాజమాన్యం మాపై ఒత్తిడి తెస్తోంది. ఇది ఇబ్బందికరంగా ఉంది.
–కె.సురేష్, రామచంద్రపురం,
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఎంబీఏ పూర్తయినా..
నేను రామచంద్రపురం వీఎస్‌ఎన్ కాలేజీలో 2023లో ఎంబీఏ పూర్తి చేశాను. ఫీజు మొత్తం చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. రూ.48,500 వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము ప్రభుత్వం నుంచి రావాలి. ఏడాదిగా వీటి కోసం ఎదురు చూస్తున్నాను. మా తండ్రి ఇటుక బట్టీ నిర్వహణలో పాలుపంచుకుంటున్నాడు. సర్టిఫికెట్లు రాకపోవడంతో ఉద్యోగ అవకాశాలు రావడం లేదు.
–ఎస్.గంగరాజు, సందిపూడి, ఆలమూరు మండలం
రూ.60 వేల బకాయి రావాలి
నేను అమలాపురం మిరియాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. కానీ ఇంకా రెండు టర్మ్‌ల నుంచి నాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదు. సుమారు రూ.60 వేల వరకూ రావాలి. కళాశాల యాజమాన్యం ఫీజు బకాయి కట్టమని ఒత్తిడి చేసింది. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలి.
–బొక్కా రమేష్, జనుపల్లి,
అమలాపురం మండలం
25ఎఎంపీ04: కె.సురేష్

తొలి ఏడాది లేదు..