
గంబూషియా చేపల విడుదల
అమలాపురం రూరల్: దోమల సంతానోత్పత్తి నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 2 లక్షల గంబూషియా చేపలను మత్స్యశాఖ కేటాయించినట్లు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎం.దుర్గారావు దొర తెలిపారు. ఈ నెల 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన చాంబర్‌లో వరల్డ్ మస్కిటో డే బ్యానర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా మలేరియా నివారణపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈదరపల్లిలో గంబూషియా చేపల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని 38 పీహెచ్‌సీల పరిధిలో గల 132 గ్రామాల్లో 2 లక్షల గంబూషియా చేప పిల్లలను విడుదల చేస్తామన్నారు.