అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అల్లవరం మండలం డి.రావులపాలేనికి చెందిన పార్టీ నేత జిన్నూరి రామారావు (బాబి) పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం సోమవా రం రాత్రి ఆయనకు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు బాబి రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ అయిన బాబి తొలి నుంచీ రైతు సమస్యలపై ఉద్యమాలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యునిగా కూడా నియమితులయ్యారు. గతంలో దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. క్షేత్ర స్థాయిలో రైతు అవసరాలపై అవగాహన ఉన్న ఆయనకు ఈ పదవి దక్కిందని రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు అన్నారు. బాబి ఎంపికపై రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 26 అర్జీలు
అమలాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 26 అర్జీలు అందాయి. ప్రతి అర్జీదారునితో ఎస్పీ ముఖాము ఖి చర్చించారు. అర్జీల్లో సగం ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. అర్జీదారుల సమస్యలకు ఎస్పీ పరిష్కార మార్గాలను సూచించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రేవు వద్ద వాహనాల రద్దీ
సఖినేటిపల్లి: చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా సఖినేటిపల్లి రేవు వద్ద సోమవారం వాహనాల రద్దీ ఏర్పడింది. రాజోలు నియోజకవర్గ ప్రజలకు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమైన చించినాడ వంతెనను ఒక రోజు మూసివేశారు. దీంతో సమీపంలో ఉన్న సఖినేటిపల్లి వద్ద వశిష్ట రేవు పంట్లపై దాటేందుకు వాహనాల్లో తరలివచ్చారు. గంటల తరబడి రేవు దాటడానికి అవస్థలు పడ్డారు.
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బాబి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బాబి