డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ | - | Sakshi
Sakshi News home page

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

Aug 15 2025 7:08 AM | Updated on Aug 15 2025 7:08 AM

డా. బ

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

లో

మాస్టార్‌కి బుక్కురిబిక్కిరి

ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన సామర్థ్యాలను అంచనాకు ఏటా పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, రెండు సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025

తీవ్ర ఇబ్బంది

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంచాయతీలకు ఇవ్వలేదు. దీనివల్ల చిన్న పంచాయతీలలో అభివృద్ధి పనులు చేసేందుకు వీలు కలగడం లేదు. పంచాయతీల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. వెంటనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.

– సబ్బితి మోహనరావు, సర్పంచ్‌,

గోపాలపురం, రావులపాలెం పంచాయతీ

తక్షణం నిధులు ఇవ్వాలి

మైనర్‌ పంచాయతీలే కాదు, మేజర్‌ పంచాయతీలకు కూడా నిధులు ఇబ్బంది ఉంది. పారిశుధ్య చర్యలు, విద్యుత్‌ బిల్లులకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇంచుమించు ఏడాది నుంచి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేదు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేకపోతున్నాం.

– నక్కా అరుణకుమారి, మండల సర్పంచ్‌ల

సమాఖ్య అధ్యక్షురాలు, కామనగరువు

సర్పంచ్‌, అమలాపురం మండలం

సాక్షి, అమలాపురం: గ్రామ పంచాయతీలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుండా పాలకులను ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా నిధుల కోసం పంచాయతీలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధుల విడుదల కాస్త ఆలస్యమైతే చాలు నానాయాగి చేసిన కూటమి నాయకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్‌ అయిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీలను ఆర్థిక ఇక్కట్లుకు గురి చేస్తోంది. వీటితో పాటు పంచాయతీలకు రావాల్సిన రిజిస్ట్రేషన్‌ సొమ్ముల వాటా ఇవ్వకుండా, ఇతర రూపాల్లో వచ్చే నిధులు రాకుండా చేసి పల్లె పాలనకు గ్రహణం పట్టిస్తోంది.

నిధుల పక్కదారి

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. 2024–25 సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక క్వార్టర్‌ సొమ్ములను గత ఏడాది మార్చిలో మంజూరు చేసింది. అలాగే 2025–26కు సంబంధించి తొలి క్వార్టర్‌ నిధులు జూలైలో విడుదల చేసింది. ఈ రెండు క్వార్టర్‌ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది.

జిల్లాలో 385 పంచాయతీలు

జిల్లాలోని 385 పంచాయతీలలో సుమారు 15,43,215 మంది జనాభా ఉన్నారు. ఒక్కొక్కరికీ రూ.550 చొప్పు న ఏడాదికి రూ.84.87 కోట్లు రావాల్సి ఉంది. కేంద్ర ఇచ్చిన గత ఏడాది, ఈ ఏడాది ఈ రెండు క్వార్టర్లు కలిపి కూడా ఇంచుమించి రూ.84 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కేంద్రం ఇచ్చిన నిధులు తమకు ఇవ్వలేదని పంచాయతీ సర్పంచ్‌లు రోడ్డు ఎక్కడంతో నిధులు విడుదల జాప్యం చేసేందుకు గతంలో చేసిన పనులకు యూసీలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలపై ఒత్తిడి తెచ్చింది. యూసీలు ఇచ్చినప్పటికీ సొమ్ములు ఇవ్వకపోవడం గమనార్హం.

రెండు రకాలుగా వినియోగం

ఆర్థిక సంఘం నిధులను టైడ్‌, అన్‌టైడ్‌ అనే రెండు వి ధాలుగా వినియోగించుకునేందుకు పరిమితులు వి ధించారు. టైడ్‌ నిధులను తాగునీటి సరఫరా, బ్లీచింగ్‌, ముగ్గు, మరుగుదొడ్ల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మా ణం వంటి పనులకు ఉపయోగించాలి. అన్‌టైడ్‌కు కే టాయించిన నిధులను విద్యుత్‌ దీపాల కొనుగోలు, ని ర్వహణ, కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్లకు మరమ్మ తులు, కొత్త డ్రైనేజీల నిర్మాణం వంటి పనులకు వెచ్చించాలి.

ఆగిపోయిన అభివృద్ధి పనులు

15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని నమ్మకంతో చాలా పంచాయతీలు అన్‌టైడ్‌ విభాగంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అలాగే మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల కో సం ఎదురు చూస్తున్నారు. రెండు దఫాలుగా నిర్మించే రోడ్ల పనులు తొలి విడత జరిగాయి. రెండో విడత ప నులను సొమ్ములు వస్తేనే చేస్తామని కాంట్రాక్టర్లు భీష్మించారు. దీనితో కొన్ని రోడ్లు, డ్రైనేజీలు సగంలోనే ని లిచిపోయాయి. ఉదాహరణకు అంబాజీపేట మండ లం మాచవరం పంచాయతీకి రూ.40 లక్షల వరకు రా వాల్సి ఉంది. ఈ సొమ్ములతో పనులు చేపట్టారు. రెండు టర్మ్‌లో నిధులు వస్తాయని ఇక్కడ రూ.70 లక్షల వరకు పనులు చేయించారు. కానీ సొమ్ములు రాలేదు. తీరా నెలల పాటు సొమ్ములు రాకపోవడంతో కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేక లబోదిబోమంటున్నారు.

బ్లీచింగ్‌కూ డబ్బుల్లేవు

ప్రస్తుతం పంచాయతీల వద్ద బ్లీచింగ్‌ కొనుగోలు చేసేందుకు సైతం డబ్బులు లేకుండా పోయాయి. ఇప్పటికే గోదావరికి రెండుసార్లు స్వల్పంగా వరద వచ్చింది. ముందు భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అల్పపీడన ప్రభావం వల్ల బుధవారం మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు మొదలయ్యాయి. ఈ సమయంలో పారిశుధ్య చర్యలకు బ్లీచింగ్‌, ముగ్గు అత్యవసరం. వర్షాలపై సమీక్షలు జరిపిన ఉన్నతాధికారులు పంచాయతీలలో అవసరమైన మేరకు బ్లీచింగ్‌, ముగ్గు సిద్ధం చేసుకోవాలని సలహా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.

నిధులకు బ్రేకులు

పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు రాకపోవడానికి తోడు, ఇతర మార్గాలలో వచ్చే నిధులకు సైతం కూటమి ప్రభుత్వం బ్రేకులు వస్తోంది. ఇటీవల 300 గజాలకు పైబడి నిర్మించే ఇళ్లకు అనుమతులు పంచాయతీలకు కాకుండా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అ థారిటీకి అప్పగించింది. దీనితో వాటిపై వచ్చే ఆదా యం కూడా రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (రుడా), అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అమూడా)లకు వెళ్లిపోతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వస్తున్న ఆదాయంలో పంచాయతీలకు రావాల్సిన వాటా సొమ్ములను కూడా కూటమి ప్రభుత్వం అందించడం లేదు.

నిర్వహణ భారం

పంచాయతీలకు పన్ను వసూలు, మార్కెట్‌ పాట ల మీద వచ్చే ఆదాయం తప్ప, మిగిలిన నిధులు రావడం లేదు. దీనితో పంచాయతీల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా మైనర్‌ పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉంది. బయట నుంచి అప్పులు తెచ్చి పంచాయతీలు నడపాల్సి వ స్తోందని వాపోతున్నారు. జిల్లాలో 90 శాతానికి పై గా పంచాయతీ సర్పంచ్‌లు వైఎస్సార్‌ సీపీకి చెంది న వారే కావడంతో ప్రభుత్వం కావాలనే నిధులు అందకుండా చేస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.

II

పంచాయతీలకు నిధుల కొరత

విడుదల చేయని కూటమి సర్కార్‌

సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నా

పట్టించుకోని వైనం

కుంటుపడిన పల్లెల ప్రగతి

భారంగా మారిన గ్రామాల నిర్వహణ

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ1
1/4

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ2
2/4

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ3
3/4

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ4
4/4

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement