
పోరాట యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి
అమలాపురం టౌన్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. రామ్మోహనరావు జయంతి సందర్భంగా స్థానిక కాటన్ పార్కు వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోనసీమలోని ఆదుర్రు గ్రామంలో జన్మంచిన జక్కంపూడి విద్యార్థి నాయకుడిగా రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారని ఎమ్మెల్సీ గుర్తుచేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, పార్టీ లీగల్ సెల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు సరెళ్ల రామకృష్ణ, కల్వకొలను ఉమ తదితరులు జక్కంపూడికి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ నివాళి
స్థానిక కాటన్ పార్కు రోడ్డులోని మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కంపూడి ప్రజా పోరాటాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పోరాట యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి