
హోరాహోరీగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 15వ జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలు మూడో రోజు బుధవారం హోరాహోరీగా జరిగాయి. ఈ మ్యాచ్‌లను హాకీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి హర్షవర్దన్‌రెడ్డి, కోశాధికారి థామస్ పీటర్, టోర్నీ కో–ఆర్డినేటర్ రవిరాజు పర్యవేక్షించారు. పోటీలను మేజర్ స్పాన్సర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు బి.కిరణ్‌కుమార్, పి.త్రినాథ్, ఎం.రవికుమార్ ప్రారంభించారు. అస్సాం, మణిపూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మణిపూర్ 3–1 స్కోర్‌తో, కేరళ, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 7–0 స్కోర్‌తో విజయం సాధించగా, హిమాచల్‌ప్రదేశ్, బిహార్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోర్‌తో డ్రాగా అయ్యింది. తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 5–0 స్కోర్‌తో, మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 4–0 స్కోర్‌తో విజయం సాధించాయి. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 1–1 స్కోర్‌తో ఇరు జట్లు సమానం కావడంతో నిర్వాహకులు డ్రాగా ప్రకటించారు. జార్ఘండ్, ఛత్తీస్‌గఢ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జార్ఘండ్ 7–1తో విజయం సాధించింది.