
పోలీస్ టెన్నిస్ కోర్టు ప్రారంభం
టెన్నిస్ ఆడిన కలెక్టర్, ఎస్పీ
అమలాపురం టౌన్: స్థానిక ఆర్డీవో కార్యాలయం సమీపంలోని పోలీస్ గ్రౌండ్స్ వద్ద నూతనంగా నిర్మించిన అశోక్ బ్లెస్సన్ టెన్నిస్ కోర్టును కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ గురువారం ప్రాంరభించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ బి.కృష్ణారావుతో సరదాగా కొద్దిసేపు టెన్నిస్ ఆడి అలరించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విధుల అనంతరం మానసిక ఆరోగ్య సాధనకు ఈ కోర్టు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో దేవి సీ ఫుడ్స్ సీఎండీ పి.బ్రహ్మానందం, ఏఎస్పీ ఏవీఎస్‌పీబీ ప్రసాద్, డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్‌బీ సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాసరావు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అపజయాలే విజయ సోపానాలు
ట్రైనీ ఐఏఎస్ అధికారి బుద్ధి అఖిల్
యానాం: ఐఏఎస్ సాధనలో ఎన్నో అపజయాలు చూసి చివరికి విజయం సాధించానని అందుకే అవి నా విజయసోపానాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ కమిషనర్ బుద్ధి అఖిల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక అంబేడ్కర్ విజ్ఞాన్‌భవన్‌లో యానాం, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆయన అవగాహన సదస్సు నిర్వహించి పరీక్షకు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చదవాల్సిన పుస్తకాలపై అవగాహన కలిగించారు.

పోలీస్ టెన్నిస్ కోర్టు ప్రారంభం