
మరిడమ్మ దర్శనానికి భారీగా భక్తులు
పెద్దాపురం: భక్తుల కల్పవల్లిగా ఖ్యాతికెక్కిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గురువారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూ లైన్లలో బారులు తీరి మరీ అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కలు చెల్లించుకున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది చర్యలు చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు.