
ప్రజా వైద్యానికి వైఎస్ జగన్ పెద్దపీట
అమలాపురం టౌన్: కరోనా కష్ట కాలంలోనూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య సేవలను ప్రజల దరిచేర్చారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ గుర్తు చేశారు. అంతలా వైద్య సేవలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సోమవారం అమలాపురంలో ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజారోగ్య వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసిందని, మంత్రి సత్యకుమార్ ఈ వాస్తవాలను గ్రహించి మాట్లాడితే బాగుంటుందని కిషోర్ సలహా ఇచ్చారు. కరోనా సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి ఓ రక్షణ కవచంలా ఉండి ప్రతి కరోనా రోగికి ప్రభుత్వ వైద్యం అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. కొన్ని వేల కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు– నేడు పథకం ద్వారా సకల సౌకర్యాలు అంటే సీటీ స్కాన్, ఎమ్మారై మెషీన్లు, డయాలసిస్ యూనిట్లు తదితరాలను కల్పించారని స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆస్పత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజా వైద్యం పట్ల అంత ప్రేమ ఉంటే నాడు వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి మధ్యలో ఆగిపోయిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
నేటి నుంచి డెంగీ నివారణ మాసోత్సవాలు
అమలాపురం టౌన్: జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణలో భాగంగా మంగళవారం నుంచి జాతీయ డెంగీ మాసోత్సవాలు–2025 నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.దుర్గారావు దొర వెల్లడించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో డెంగీపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన బ్యానర్లను సోమవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా దుర్గారావు దొర మాట్లాడుతూ డెంగీ, మలేరియా, ఫైలేరియా నివారణకు పలు జాగ్రత్తలు, సూచనలతో వైద్య శాఖ గోడ పత్రికలు, బ్యానర్లు, కరపత్రాలు ముద్రించిందన్నారు. డెంగీ కారణంగా తీవ్రమైన జ్వరం లేదా అంతకంటే ఎక్కువ తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, బలహీనత, అలసట వంటి రుగ్మతలు అనివార్యమవుతాయని ఆయన చెప్పారు. ఇంట్లో పరిసరాల శుభ్రత పాటించి, నిల్వ నీరు లేకుండా చూడాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ కాగానే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స పొందాలని సూచించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కార్తీక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్రావు, జిల్లా మలేరియా అధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి సత్యకుమార్ ఆలోచించి మాట్లాడాలి
ఫ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధికార ప్రతినిధి కిషోర్

ప్రజా వైద్యానికి వైఎస్ జగన్ పెద్దపీట