
రేపు బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ సమావేశం
విజయవంతం చేయాలని పార్టీ
జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి పిలుపు
అమలాపురం రూరల్: ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు నిర్వహించే సమావేశ వేదికై న అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి ఎ–కన్వెన్షన్ హాలును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో పాటు పార్టీ నేతల బృందం సోమవారం పరిశీలించింది. ఆ రోజు కార్యక్రమానికి పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కావడమే కాకుండా ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ని ప్రారంభిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి తెలిపారు. ఆ రోజు జరిగే జిల్లా స్థాయి పార్టీ సమావేశానికి జిల్లాలోని పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విధిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశ వేదికై న ఎ– కన్వెన్షన్ ఫంక్షన్ హాలును జగ్గిరెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదటి శిరీష్, పార్టీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్‌రాజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, రూరల్ మండల అధ్యక్షుడు గుత్తుల చిరంజీవి, సెంట్రల్ డెల్టా బోర్డు మాజీ చైర్మన్ కుడుపూడి బాబు, కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కొల్లాటి దుర్గాబాయి, నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, దూడల ఫణి, కల్వకొలను ఉమ తదితరులు పాల్గొన్నారు.