
ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలు ప్రదర్శించాలి
రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు.
ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. వైద్యం ప్రారంభించే సమయంలోనే రోగి లేదా వారి బంధువులకు సేవల వివరాలు, ధరలను స్పష్టంగా వివరించాలన్నారు. ఈ సూచనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.